మరోసారి రచ్చకు తెరలేపిన మంచు మనోజ్
మంచు మోహన్ బాబు తనయులు విష్ణు, మనోజ్ మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. విష్ణు ప్రవర్తన ఇదీ అంటూ ఓ వీడియో పోస్ట్ చేసి సంచలనం సృష్టించిన మంచు మనోజ్.. తొలిసారి ఆ గొడవ మీద పరోక్షంగా రియాక్ట్ అయ్యారు. మంచు విష్ణు, మనోజ్ నడుమ మధ్య ఏం జరిగింది? అసలు గొడవకు కారణం ఏమిటి? అనేది చర్చనీయాంశం అయింది. ఇక ఇదంతా పక్కన పెడితే.. తాజాగా మనోజ్ పెట్టిన ట్వీట్స్ మరింత హాట్ టాపిక్ అయ్యాయి. ఇవి చూసి విష్ణుతో గొడవపైనే మనోజ్ ఇలా రియాక్ట్ అయ్యారని చెప్పుకుంటున్నారు జనం.
నెగిటివిటీయే క్రియేటివిటీకి శత్రువు అంటూ మనోజ్ ఓ సందేశాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో మంచు విష్ణు నెగెటివ్ గా ఆలోచిస్తున్నారనే మనోజ్ ఇలా ట్వీట్ పెట్టారని చెప్పుకుంటున్నారు నెటిజన్లు. ఏమీ జరగనట్టు (తప్పుల్ని) అలా చూస్తూ ఉండిపోవడం కన్నా.. నిజం కోసం పోరాటం చేసి చావడానికైనా సిద్ధమే అంటూ మరో కొటేషన్ కూడా షేర్ చేశారు మంచు మనోజ్. మీరు బతకండి. మమ్మల్ని బతకనివ్వండి. అందరికీ ప్రేమతో అంటూ మనోజ్ ట్యాగ్ చేయడం సరికొత్త చర్చలకు తావిచ్చింది.
తండ్రి మోహన్ బాబుతో కలిసి మంచు విష్ణు ఉంటున్నారని, మంచు మనోజ్ వేరుగా ఉంటున్నారనే న్యూస్ ఎప్పటినుంచో వినిపిస్తోంది. గత రెండుమూడేళ్లుగా మంచు విష్ణుకి మంచు మనోజ్ బర్త్ డే విషెస్ కూడా చెప్పకపోవడం, రీసెంట్ గా జరిగిన మంచు మనోజ్ రెండో పెళ్ళికి విష్ణు చుట్టంచూపుగా వచ్చి వెళ్లడంతో జనాల్లో అనుమానాలు ముదిరాయి.