AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉస్మానియా యూనివర్సిటీలో హైటెన్షన్..

ఉస్మానియా యూనివర్సిటీలో హైటెన్షన్‌ క్రియేట్‌ అయ్యింది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీపై ఏబీవీపీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఆందోళనలు.. అరెస్టులతో ఓయూ ప్రాంగణం అల్లకల్లోలంగా మారింది. టీఎస్‌పీఎస్‌సీ ఇష్యూ ఉస్మానియా యూనిర్సిటీని దద్దరిల్లేలా చేస్తోంది. పేపర్‌ లీక్స్‌ పై ఉస్మానియా విద్యార్థుల ఆందోళనలు ఓయూలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఏబీవీపీ విద్యార్థుల నేతృత్వంలో భారీగా విద్యార్థులు కదలి వచ్చారు. టీఎస్‌పీఎస్‌సీ లీక్స్‌పై విద్యార్థుల నినాదాలతో ఓయూ ప్రాంగణం దద్దరిల్లింది. బీజేపీ పిలుపునందుకొని మహాధర్నాకు వెళ్ళేందుకు ఓయూ విద్యార్థులు ప్రయత్నించారు.

ఓయూలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. విద్యార్థులను అడుగు ముందుకు వేయకుండా అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులను తోసుకుని ర్యాలీగా వెళ్ళారు ఏబీవీపీ కార్యకర్తలు. దీంతో పోలీసులకూ, విద్యార్థులకూ మధ్య వాగ్వివాదం జరిగింది. ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి, బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించుకొని తీసుకెళ్ళారు.

ANN TOP 10