(అమ్మన్యూస్, హైదరాబాద్):
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. 2011 రైల్‌రోకో కేసుల్లో కేసీఆర్ పై విచారణకు హైకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేసింది.
అసలేమైంది..
మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. 2011లో రైల్‌రోకో సందర్భంగా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో తనను 15వ నిందితుడిగా చేర్చారని.. అసలు తాను రైల్‌రోకోలోనే పాల్గొనలేదని పిటిషన్‌లో తెలిపారు. అయితే కేసీఆర్ పటిషన్ పై మంగళవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. కేసీఆర్ కు సానుకూలంగా తీర్పు వెలువరించింది. ఈ కేసుపై స్టే విధించింది.