AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జగన్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. పులివెందుల వెళ్తుండగా ఘటన

ఢీకొన్న కాన్వాయ్‌లోని వాహనాలు

(అమ్మన్యూస్, కడప):
ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. శనివారం ఆయన తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో పర్యటన ఉన్న నేపథ్యంలో విమానంలో కడప విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి ఆయన పులివెందులకు వెళ్తుండగా రామరాజు పల్లి వద్ద కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికి మరొకటి ఢీకొన్నాయి. జగన్‌ కాన్వాయ్‌లోని ఇన్నోవా వాహనాన్ని ఫైర్‌ ఇంజన్‌ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాన్వాయ్‌లోని వాహనాలు– కేసారి స్లో కావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, వైఎస్‌ జగన్‌ పులివెందులలో మూడు రోజులపాటు బస చేయనున్నారు. ఈ సమయంలో రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. పార్టీ ఓటమిపై సమీక్షించనున్నారు.

ANN TOP 10