AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హ్యాపీ బర్త్‌ డే భువనేశ్వరి .. సీఎం నారా చంద్రబాబు బర్త్‌ డే విషెష్‌

థ్యాంక్స్‌ చెబుతూ భువనేశ్వరి ట్వీట్‌

(అమ్మన్యూస్, అమరావతి):
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా.. ‘ప్రజలకు సేవ చేయాలనే నా తపనలో ఆమె వంద శాతం అండగా నిలిచారు. నాకెప్పుడూ సహకరిస్తూ.. కష్ట సమయంలో కూడా నవ్వుతూ నా అభిరుచిని అనుసరించారు. నా సర్వసం కూడా.. హ్యాపీ బర్త్‌ డే నారా భువనేశ్వరి’ అని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

నారా లోకేశ్‌ శుభాకాంక్షలు..
నారా భువనేశ్వరికి ఆమె కుమారుడు, మంత్రి నారా లోకేష్‌ కూడా ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు.. మీ ప్రేమ, దయ, మద్దతు నాకు పెద్ద బలం.. ప్రజలకు సేవ చేయడం, వ్యాపార చతురత, న్యాయం కోసం పోరాడటం పట్ల చూపే అంకితభావం స్ఫూర్తిదాయకం. రోజూ అమ్మను ఆరాధిస్తా.. ప్రేమతో తమ జీవితాలను ప్రకాశవంతం చేస్తున్న ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలి’ అంటూ లోకేష్‌ ట్వీట్‌ చేశారు.

స్పందించిన భువనేశ్వరి..
చంద్రబాబు ట్వీట్‌పై భువనేశ్వరి ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘దన్యవాదాలండి.. నన్ను రోజూ మరింత మెరుగయ్యేలా ఇన్‌స్పెయిర్‌ చేస్తారు. పెద్ద కుటుంబంగా పిలిచుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ పట్ల మీకున్న భక్తికి నేను ఎప్పుడూ గర్విస్తాను. నేను ఎప్పుడూ మీకు మద్దతుగా ఉంటాను. మీరే నాకు సర్వసం’ అంటూ ట్వీట్‌ చేశారు. నారా భువనేశ్వరికి టీడీపీ కార్యర్తలు కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ANN TOP 10