AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

క‌రెంట్ బిల్లు రూ.21 కోట్లు.. ఖంగుతిన్న ఇంటి య‌జ‌మాని

సాధార‌ణంగా ఓ ఇంటికి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది? రెండు బ‌ల్బులు, ఫ్యాన్‌లకు చూసుకుంటే ఐదు వందల వరకు వస్తుంది. మరీ వినియోగం ఎక్కువైతే 5 వేల వ‌ర‌కు వ‌స్తుంది. ఏసీలు, కూల‌ర్లు, ఎల‌క్ట్రిటిక్ ప‌రిక‌రాలు ఎక్కువ‌యితే ఎంత లేద‌న్నా నెల‌కు ఒక 10 వేల వ‌ర‌కూ వ‌స్తుంది. కానీ, ఈ ఇంటికి ఎంత క‌రెంటు బిల్ వ‌చ్చిందో తెలిస్తే నిజంగానే మీకు క‌రెంట్ షాక్ త‌గులుతుంది. క‌రెంట్ బిల్లు చూసిన ఆ య‌జ‌మానికి ఒక్క‌సారిగా క‌రెంట్ షాక్ కొట్టినంత ప‌న‌య్యింది. ఆ ఇంటికి ఒక్క‌నెల క‌రెంటు బిల్లు రూ.21 కోట్లు వ‌చ్చింది.

ఈ ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివ‌రాలిలా ఉన్నాయి.. Chandrababu Oath Ceremony: అమరావతి కాదని కేసరపల్లి ఎందుకంటే ? బిజినేపల్లి మండలం ఖానాపురానికి చెందిన వేమారెడ్డి ఇంట్లో ఉన్న సర్వీస్‌ నెంబర్‌ 1110000 51 మీటర్‌ కేవలం 0.60 కిలోవాట్‌కు సంబంధించినది. అయితే, విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో వందల్లో రావాల్సిన క‌రెంటు బిల్లు కాస్త‌ రూ.కోట్లలో వచ్చింది. దీంతో ఆ ఇంటి య‌జ‌మాని కాస్త ఒక్క‌సారిగా ఖంగుతిన్నాడు. 01-01-1970 నుంచి 05-06-2024 వరకు 998 రోజులపాటు 297 యూనిట్లు వినియోగించినట్టు, అందుకు రూ.21,47,48,569 కరెంట్‌ బిల్లు వచ్చినట్టు ఈ నెల 5న వినియోగదారుడికి ఇచ్చి న బిల్లులో ఉంది. దాంతో బిల్లు అందుకున్న వేమారెడ్డి షాక్‌కు గుర‌య్యాడు. అయితే, ఇదేంద‌ని ట్రాన్స్‌కో సిబ్బంద‌ని ప్ర‌శ్నించగా, వారు పై అధికారులకు ఫిర్యాదు చేశారు.

ANN TOP 10