ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, రాష్ట్రవిభజన తరువాత రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అరుదైన ఘనతను సాధించారు. మొన్నటి వరకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రను తిరగరాస్తూ తాజాగా నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఏపీ ముఖ్యమంత్రిగా జూన్ 12 ఉదయం 11.27 నిమిషాలకు సింహలగ్నంలో బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణస్వీకార మహోత్సవానికి దేశ ప్రధాని మోదీతో పాటు ముఖ్యశాఖల కేంద్ర మంత్రులు హాజరు అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, రాష్ట్రవిభజన తరువాత రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అరుదైన ఘనతను సాధించారు. మొన్నటి వరకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రను తిరగరాస్తూ తాజాగా నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఏకైక తెలుగు నాయకుడిగా చరిత్ర ఉన్న నేపథ్యంలో మరోసారి సీఎం పదవిని చేపట్టి తన రికార్డును తానే తిరగరాసుకున్నారు.
1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తరువాత 1999లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ఎన్నికయ్యారు. విభజన రాష్ట్రంలో 2014 నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. 2024లో మరోసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి తెలుగుజాతికే చెరిగిపోని ముద్రను వేశారు. ఈ ఐదు సంవత్సరాల కాలం పూర్తైతే మొత్తం 19ఏళ్ల పాటు తన విలువైన సేవలను రాష్ట్రానికి అందించిన వారి ఖాతాలో చెరిగిపోని ముద్ర వేసుకోనున్నారు. చంద్రబాబు పీఠమెక్కిన తరువాత తీసుకున్న ప్రతి నిర్ణయం సంచలంగా ఉండేది. టెక్నాలజీ మొదలు వ్యవసాయం వరకు, విద్య మొదలు మద్యం వరకు ప్రతి నిర్ణయంలో తనదైన మార్క్ చూపించారు. గతంలో హరితాంధ్రప్రదేశ్ సాధకుడిగా, స్వచ్ఛాంధ్రప్రదేశ్ సేవకుడిగా కూడా పేరొందారు. తాజాగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ శ్రామికుడిగా తన అడుగుల వేగం పెంచుతూ అభివృద్దిదిశగా ముందుకు సాగుతున్నారు.