AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజాసింగ్‌కు పదేళ్లుగా బెదిరింపులు: ఎట్టకేలకు నిందితుడి అరెస్ట్

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తరచూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే..! 2014 నుండి గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ కు అనేకసార్లు ఇతర దేశాల నుండి బెదిరింపు కాల్స్ వచ్చేవి. సంబంధం లేని నెంబర్లు, సంబంధం లేని వ్యక్తులు పదేపదే ఫోన్లు చేసి తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని పలుమార్లు రాజాసింగ్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఎన్నికల సమయంలోనూ రాజాసింగ్ కు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తిని ట్రేస్ చేసేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు రాజాసింగ్ కు ఫోన్ చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వసీంగా గుర్తించారు పోలీసులు. ఉద్యోగరీత్యా దుబాయ్ లో స్థిరపడ్డాడు వసీం. రాజా సింగ్ ఫిర్యాదు తర్వాత ఆ ఫోన్ నెంబర్లను ఆధారంగా చేసుకుని సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా బెదిరింపు కాల్స్ వస్తున్న నంబర్ దుబాయ్ నుండి ఆపరేట్ అవుతున్నట్లు గుర్తించారు. అతడి లొకేషన్ ఆధారంగా వివరాలను ఆరా తీశారు హైదరాబాద్ పోలీసులు. మహమ్మద్ వసిం దుబాయ్‌లో ఉంటూ రాజాసింగ్‌కు పదే పదే ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డట్టు పోలీసులు నిర్ధారించారు. ఒక ఫోన్ నెంబర్ తో కాకుండా దాదాపు పదికి పైగా ఫోన్ నెంబర్లను మారుస్తూ ఉపయోగించినట్టు తేలింది. నిరంతరం రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ చేసి వేధింపులకు గురి చేశాడు వసీం. ఈ వ్యవహారంపై పోలీసులకు రాజాసింగ్ ఫిర్యాదు పలు మార్లు ఫిర్యాదు చేశాడు.. దీంతో వసీంను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10