గోదావరి నదిలో పడి తల్లి, కొడుకు గల్లంతయ్యారు(Mother and son missing). ఈ విషాదకర సంఘటన ఈ విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కట్కూరు వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన ఓ కుటుంబం 14 మంది భక్తులతో కలిసి కట్కూరులోని శివాలయానికి దైవ దర్శనం కోసం వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అల్లంశెట్టి నాగమణి(48) ఆమె కుమారుడు తేజ శ్రీనివాస్(23) గోదావరిలో గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
![](https://anntelugu.com/wp-content/uploads/2025/02/images-79.jpeg)