AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పిల్లలకు తల్లిదండ్రుల ప్రోత్సాహం తప్పనిసరి

కేఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ కంది శ్రీనివాసరెడ్డి
పిల్లలకు ప్రశంసా పత్రాల బహూకరుణ
వేసవి శిక్షణ శిబిరం ముగింపు వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన కంది శ్రీనివాసరెడ్డి దంపతులు

(అమ్మన్యూస్, ఆదిలాబాద్‌):
పిల్లలు ఏ రంగాన్ని ఇష్టపడుతారో తల్లిదండ్రులు ఆ రంగంలో తగిన ప్రోత్సాహం ఇవ్వాలని కేఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో స్వీకృతి డ్యాన్స్‌ అకాడమీ గంగా సంగీత నాట్య అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన తన సతీమణి కంది సాయి మౌనా రెడ్డి తో పాటు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.కేఎస్‌ ఆర్‌ ఫౌండేషన్‌ ,జీకే స్టీల్‌ అండ్‌ బ్రాస్‌ మర్చంట్, ఎ. వి. కే ఫౌండేషన్‌ సహకారంతో నిర్వహించిన కార్యక్రమం లో ముందుగా నటరాజ విగ్రహానికి పూలమాలలు జ్యోతి ప్రజ్వలన చేసారు.


సమావేశంలో కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వేసవి సెలవులను చక్కగా వినియోగించుకున్న విద్యార్థులను, శిక్షణనిచ్చిన అకాడమీలను ప్రోత్సాహించిన తల్లి దండ్రులను ఆయన అభినందించారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో నేర్చు కోవాలన్న తపన పెరుగుతుందన్నారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న పిల్లలకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జహీర్‌ రంజాని,కౌన్సిలర్‌ దర్శనాల లక్ష్మణ్,తిరుమల్‌ రెడ్డి,అఫ్రోజ్‌ అహ్మద్,కయ్యుమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10