భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీకి మైక్రోసాఫ్ట్ సంస్థ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ శుభాకాంక్షలు తెలిపారు. “వరుసగా మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు అందుకున్న నరేంద్ర మోదీకి శుభాభినందనలు. ఆరోగ్యం, వ్యవసాయం, మహిళా ఆధారిత అభివృద్ధి, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ తదితర రంగాల్లో అంతర్జాతీయ ఆవిష్కరణలకు వనరుగా భారత్ స్థానాన్ని బలోపేతం చేశారు. భారత్ లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దడం కోసం మన భాగస్వామ్యం కొనసాగుతుందని ఆశిస్తున్నాను” అంటూ బిల్ గేట్స్ పేర్కొన్నారు.