AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆన్‌లైన్‌లోనే ఇక అన్ని టీఎస్‌పీఎస్సీ పరీక్షలు

ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనతో ఇకపై అన్ని పరీక్షలను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించడానికి టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే సీబీటీ మోడ్‌లో కొన్ని పరీక్షలు జరుపుతుండగా, భవిష్యత్తులో అన్ని పరీక్షలను నిర్వహించాలని చూస్తున్నది. ప్రశ్నపత్రాల తయారీ, భద్రతతోపాటు సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే దిశగా ప్రణాళికలు రచిస్తున్నది.

భారీ సంఖ్యలో ప్రశ్నలను రూపొందించి, అభ్యర్థుల సంఖ్యను బట్టి అప్పటికప్పుడు ఏ ప్రశ్నలు ఇవ్వాలనే దానిపై కసరత్తు చేస్తున్నది. దీనివల్ల ప్రశ్నపత్రాల లీకేజీ అనేది ఉండబోదని భావిస్తున్నది. టీఎస్‌పీఎస్సీ 25 వేలలోపు దరఖాస్తులు వస్తేనే సీబీటీ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నది. ఆ సంఖ్యను 25 వేల నుంచి 50 వేలకు పెంచాలని కమిషన్‌ భావిస్తున్నది. దేశంలో కొన్ని రాష్ర్టాల్లోని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లలో సీబీటీ పద్ధతి ఇప్పటికే అమల్లో ఉన్నది. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ), ఐబీపీఎస్‌లు సైతం ఇప్పటికీ సీబీటీ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఆ కమిషన్లు ఎలాంటి విధానాలు అమలు చేస్తున్నాయి? పరీక్షల నిర్వహణ ఎలా ఉన్న ది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నా యి? అనే విషయాలపై టీఎస్‌పీఎస్సీ అధ్యయనం చేస్తున్నది. అత్యుత్తమమైన వి ధానాలను తీసుకొచ్చేందుకు మేధోమథనం జరుపుతున్నది.

ANN TOP 10