రెండు భారీ ఎనుగుల మధ్య భీకర పోరు జరిగింది. ఈ పోరును సఫారీలో ఉన్న ఓవ్యక్తి వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. జంతువులన్నింటిలో భారీ శరీరం కలిగినవి ఏనుగులే.. ఏనుగుకు కోపం వస్తే సింహం కూడా పిల్లిలా సైడ్ వెళ్ళిపోతుంది. తెలివిలోనూ, ప్రవర్తనలోనూ ఏనుగు చాలా మంచి జంతువు. రెండు భారీ ఏనుగులు యుద్దంచేస్తున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దక్షిణాఫ్రికాలో ఉన్న క్రూగర్ నేషనల్ పార్క్‌లో రెండు ఏనుగుల మధ్య భీకరమైన పోరు జరిగింది.
క్రూగర్ నేషనర్ పార్క్ లో సఫారీకి వెళ్ళిన ఒక వ్యక్తికి రెండు ఏనుగులు కనిపించాయి. అతను తన సఫారీ స్లో చేసి వాటిని వీడియో తీయాలని ప్రయత్నించాడు. అయితే ఏనుగులు ఉన్నట్టుండి పోరుకు దిగాయి. భారీగా ఉన్న ఆ ఏనుగులు ఒకదాన్నొకటి తోసుకుంటూ ఓ చెట్టు దగ్గరగా వెళ్ళాయి. అక్కడ ఓ ఏనుగు మరొక ఏనుగును బలం కొద్దీ తొయ్యగానే అది పక్కనే ఉన్న చెట్టుమీద పడింది. ఏనుగు దెబ్బకు చెట్టు రెండుగా చీలి ఒక భాగం నేలకు ఒరిగిపోయింది. చెట్టుమీద పడిన ఏనుగు పరాభవం జరిగిందని ఫీలైందో.. లేక ఫైటింగ్ ఇలాగే కంటిన్యూ అయితే తరువాత నా సంగతేమవుతుందో అని భయపడిరదో తెలియదు. కానీ మళ్ళీ కయ్యానికి కాలు దువ్వకుండా అక్కడి నుండి తప్పుకుని వెళ్ళిపోయింది.