(అమ్మన్యూస్, అమరావతి):
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగిసింది. ఆయన పర్యటనను ముగించుకుని కుటుంబసమేతంగా శనివారం ఉదయం విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి జగన్కు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్ నేరుగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్ వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.. ఎన్నికల కౌంటింగ్ సహా కీలక అంశాలపై వారితో చర్చిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నారు. లెక్కింపు రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైఎస్సార్సీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.