రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆహ్వానం అందజేశారు కాంగ్రెస్ ప్రోటోకాల్ ప్రతినిధి. కేసీఆర్ నివాసానికి వెళ్లిన ప్రతినిధులు ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. ఈ ఆహ్వానంపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, వేడుకలకు హాజరవుతానని చెప్పినట్లు ప్రొటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్ తెలిపారు.
తెలంగాణ సర్కార్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఎంతో అట్టహాసంగా నిర్వహించనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర అవిర్భావ వేడుకలకు కేసీఆర్ కు ఆహ్వానం అందజేశారు. ఆహ్వాన పత్రికతో పాటు సీఎం రేవంత్ లేఖను కూడా కేసీఆర్ కు అందజేశారు ప్రోటోకాల్ ప్రతినిధులు.
హర్కర వేణుగోపాల్..
”ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన సందేశంతో పాటు వారు ఇచ్చిన లేఖను, ఆహ్వాన పత్రికను కేసీఆర్ కు అందజేశాం. ఇది 60 ఏళ్ల కల. పండుగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నాం. ఈ సంబురంలో అందరినీ ఇన్వాల్ చేస్తున్నాం. అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర ఉంది. ఆయనను కలిసి ప్రత్యేకంగా ఆహ్వానం పలికాం. ఆ బాధ్యతను ముఖ్యమంత్రి మాకు అప్పగించారు. జూన్ 2న అత్యంత వైభవంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు చేస్తున్నాం. కేసీఆర్ తప్పకుండా ఈ వేడుకల్లో భాగస్వామం అవుతారని ఆశిస్తున్నాం”.