AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మిస్టర్ కేటీఆర్.. దోపిడీ సొమ్ము కక్కిస్తాం: కాంగ్రెస్‌ స్ట్రాంగ్ కౌంటర్

మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేళ అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఏపీకి చెందిన కీరవాణికి స్వర రచన చేయడం అప్పగించడంపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పెద్దయెత్తున వాదన జరుగుతుంది. ఈ క్రమంలోనే రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ వ్యాఖ్యలకు తెలంగాణ కాంగ్రెస్ గట్టి కౌంటర్ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అని చెప్పిన గత ముఖ్యమంత్రి ఎవరని ప్రశ్నించింది. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా కాంగ్రెస్ సోషల్ మీడియా.. తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొందిన తర్వాత సోనియా గాంధీ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబం సభ్యులు ఎవరు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష డ్రామా చేసింది ఎవరు. తెలంగాణ రాష్ట్రం కోసం సబ్బండ వర్గాల ప్రజలు రోడ్లమీదకు వస్తే పెట్రోల్ బాటిల్ పట్టుకుని అగ్గిపుల్ల గీయకుండా డ్రామా చేసింది ఎవరు.

తెలంగాణ రాష్ట్రం కోసం అందరూ పోరాటం చేస్తుంటే దీక్ష విరమణ చేసి హాస్పిటల్‌తో జ్యూస్ తాగింది ఎవరు. తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ ఉద్యమంలో ప్రాణాలు వదిలిన తొలి అమరుడు శ్రీకాంతాచారి కుటుంబానికి అన్యాయం చేసింది ఎవరు. తెలంగాణ రాష్ట్రం కోసం అమరులు అయిన సభ్యుల వివరాలు లేవని కొంతమంది వివరాలు మాత్రమే ఉన్నాయని చెప్పింది ఎవరు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఎంతోమంది ఉండగా ఒకే కుటుంబంలో 5 మందికి పదవులు ఇచ్చింది ఎవరు. తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేసింది ‌ఎవరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత రైతులకు భేడీలు వేసి జైలుకు పంపింది ఎవరు‌. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసం చేసింది ఎవరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే దళితుడు తొలి ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసింది ఎవరు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ముస్లీం మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇవ్వకుండా 10 ఏళ్ళు మోసం చేసింది ఎవరు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే దళిత గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి 10 ఏళ్లు మోసం చేసింది ఎవరని ప్రశ్నలు కురిపించింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో మీరు దోచుకున్న భూములను, దోపిడీ సొమ్మును అన్నీ లెక్కలతో సహా కక్కిస్తాం‌మని ట్వీట్ చేసింది. మిస్టర్ కేటీఆర్ నువ్వు నీ తండ్రి 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రజలను మోసం వేసిన తీరు ఒకసారి గుర్తు చేసుకోవాలని, తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిన నీకు బుద్ది రాకపోతే ఎలా అంటూ కౌంటర్ ఇచ్చింది. తమ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, లక్ష్యం సుభిక్షమైన తెలంగాణ అంటూ కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10