AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సమంత, రకుల్.. చర్చ ఏదైనా రచ్చ వీరి చుట్టే

సమంత, రకుల్ ప్రీత్ సింగ్.. తెలంగాణ రాజకీయాలు వీరిచుట్టే ఎపుడూ తిరుగుతుంటాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలు తరచూ ఈ ఇద్దరు నటీమణుల ప్రస్తావనలు తెస్లుంటారు.. వీటికి ఇవ్వాల్సిన వారు కౌంటర్ ఇవ్వరు. నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం సమంతను చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా, రకుల్ ప్రీత్ సింగ్ ను పిల్లల సంరక్షణ కార్యక్రమాల్లో ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమాల్లో ప్రచారానికి వినియోగించారు. నేతల ఆరోపణలు.. ఆవేశాలు హద్దుమీరినపుడల్లా ఈ ఇద్దరు హీరోయిన్ల ప్రస్తావన ఏదో ఒకరూపంలో తీసుకొస్తుంటారు. సమంత దిగ్గజ సినీకుటుంబం అక్కినేని ఇంటి కోడలు కాగా, కొద్ది కాలానికే నాగచైతన్యతో విడాకులు అయ్యాయి. ఇపుడు ఫోన్ ట్యాపింగ్ పెద్ద దుమారం రేపిన నేపథ్యంలో సమంత-నాగచైతన్య కాపురంలో నిప్పులు పోసింది ఈ ఫోన్ ట్యాపింగేనని, ఆ పాపమే వెంటాడుతున్నదంటూ నేతలు కామెంట్లు చేస్తున్నారు. కారణాలు.. ఆధారాలు ఏవీ బహిర్గతం కాకున్నా ఈ ఇద్దరు భామల ప్రభావం మాత్రం తెలంగాణ పాలిటిక్స్‌లో ఫుల్‌గా ఉంది. బీఆర్ఎస్ నేతలు తెలంగాణ సెంటిమెంట్ రాజేయాలనుకున్నపుడల్లా ఆ పార్టీ పెద్లలు లక్ష్యంగా ప్రత్యర్ధులు సమంతా రకులాస్త్రం ప్రయోగిస్తున్నారు. రకుల్‌కు పెళ్ళయిపోయింది.. సమంతా పెళ్ళి విడాకులై మూడేళ్ళు దాటిపోయింది. అయినా ఈ ఇద్దరూ తెలంగాణ రాజకీయాల్లో హాట్ ట్రెండ్స్ గానే లైవ్ లో ఉన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10