అప్పుల బాధ తాళలేక మనస్థాపానికి గురై ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన మహబూబాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బత్తిని మనోహర్(50) అనే హెడ్ కానిస్టుబుల్ చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నాడు. శుక్రవారం పట్ణంలోని నరసింహనగర్ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మృతుడు మనోహర్ జిల్లా పోలీసు కార్యాలయంలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.