AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కట్టడాలు మాత్రమే ఉంటే చిహ్నం కాదు.. ప్రొ.కోదండరామ్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వం నిర్వహించడాన్ని జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ స్వాగతించారు. మొట్టమొదటి సారిగా ఆవిర్భావ వేడుకల్లో మమ్మల్ని భాగస్వామ్యం చేస్తున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఈ ఆహ్వానం దొరకలేదని చెప్పారాయన. మేము కోరుకున్న రాష్ట్ర గీతం, చిహ్నంను ప్రభుత్వం తీసుకొస్తుందని కోదండరామ్ అన్నారు. జయ జయహే తెలంగాణ పాట కొత్తగా రాసింది కాదని, పాట రాసింది ఎవరు? అనేది ముఖ్యం. పాడింది అనేది కాదు అని స్పష్టం చేశారు.

చిహ్నంపై గత ప్రభుత్వం చర్చ జరిపి ఉంటే బాగుండేదని కోదండరామ్ అభిప్రాయపడ్డారు. ఆరోజు చిహ్నంపై అభ్యంతరాలు ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని వాపోయారు. ప్రజల జీవన విధానం, సంస్కృతి ప్రతిబింబించే విధంగా లోగో ఉండాలని కోదండరామ్ సూచించారు. ఆనాడు మార్పులు చేర్పులు చేయాలని ఉన్నా జరగలేదన్నారు. లోగో మార్చితేనే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అని కోదండరామ్ చెప్పారు.

”కట్టడాలు మాత్రమే ఉంటే చిహ్నం కాదు. కొత్త లోగోలో కూడా కట్టడాలు ఉంటాయని అనుకుంటున్నా. ఛత్తీస్ ఘడ్ లోగోలో 32 కట్టడాలు ఉంటాయి. ఉద్యమకారుడు, మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను ప్రభుత్వం వేడుకలకు ఆహ్వానిస్తుంది” అని కోదండరామ్ అన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10