రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ విడుదలైంది. ఈ ఏడాది జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండడంతో.. ఈ నేపథ్యంలోనే శనివారం పాఠశాల విద్యాశాఖ క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. ఇక వచ్చే విద్యా సంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూళ్లు పనిచేయనున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 24వ తేదీ చివరి వర్కింగ్ డే. 2025 ఏప్రిల్ 24 నుంచి 2025 జూన్ 11 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. 2025 జనవరి పదో తేదీ వరకు పదో తరగతి సిలబస్‌ను పూర్తి చేయనున్నారు. తర్వాత రివిజన్ క్లాసులు ఉంటాయి. ఫిబ్రవరి 28, 2025 వరకు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి సిలబస్ పూర్తి చేస్తారు. ప్రతీ రోజూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఐదు నిమిషాల పాటు యోగా, మెడిటేషన్ క్లాసులు ఉండనున్నాయి. ఇక 2025 ఫిబ్రవరి 28వ తేదీ లోపు పదో తరగతి ప్రి ఫైనల్ పరీక్షలు నిర్వహించనుండగా.. మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు.
దసరా సెలవులు: అక్టోబర్ 2 నుంచి 14వ వరకు
క్రిస్మస్ సెలవులు: డిసెంబర్ 23 నుంచి 27 వరకు
సంక్రాంతి సెలవులు: జనవరి 13 నుంచి 17 వరకు
వేసవి సెలవులు: ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు