AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ధూమ్ సినిమా రేంజ్‌లో హైవేపై చోరీ.. కదులుతున్న లారీ నుంచి..

ధూమ్ సినిమాలో జరిగిన దొంగతనాలు మీరు చూశారా. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా హీరో ఎన్నో దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అయితే తాజాగా ఓ హైవేపై జరిగిన చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. బైక్‌పై ముగ్గురు వ్యక్తులు వెళ్లగా.. అందులో ఇద్దరు ముందు వెళ్తున్న ఓ ట్రక్కును ఎక్కి దానిపై ఉన్న వస్తువులను కింద పడేశారు. అనంతరం ఆ ట్రక్కు నుంచి నేరుగా బైక్‌పై దిగారు.

హైవేపై ఓ ట్రక్కు వెళ్తుండగా.. దాని వెనకాలే వెళ్లిన ముగ్గురు దొంగలు.. దాన్ని ఎక్కి.. ట్రక్కులో ఉన్న మూటలను హైవేపై పడేశారు. అనంతరం.. ట్రక్కుపైనుంచి బైక్‌పై దిగి.. ఆ సామాన్లు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దొంగతనానికి సంబంధించిన వీడియోను.. అదే హైవేపై వేరే వాహనంలో వెళ్తున్న కొందరు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.

మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో ఆగ్రా- ముంబై జాతీయ రహదారిపై ఈ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. హైవేపై వేగంగా వెళ్తున్న ట్రక్కు నుంచి కొందరు దొంగలు సామాన్లు దొంగిలించడం సంచలనంగా మారింది. బైక్‌పై వెళ్లిన ముగ్గురు దొంగలు.. ట్రక్కును వెంబడించి.. దాని వెనకాలే వెళ్తూ.. బైక్‌పై నుంచి ఇద్దరు వ్యక్తులు ఆ ట్రక్కుపైకి రన్నింగ్‌లోనే ఎక్కారు. మూడో వ్యక్తి బైక్‌ను నడుపుకుంటూనే ట్రక్కును వెంబడించాడు. ఇక ఆ ట్రక్కుపైకి ఎక్కిన ఇద్దరు వ్యక్తులు.. ఆ లోడ్‌లో నుంచి కొన్ని సామాన్లను తీసి హైవేపై పడేశారు. అనంతరం మళ్లీ ఆ ట్రక్కు నుంచి బైక్‌పైకి కదులుతుండగానే దిగారు. ఆ తర్వాత హైవేపై పడేసిన సామాన్లను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10