AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మరో వివాదంలో ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి.. చేవెళ్ల పీఎస్‌లో కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. భూమి కజ్జా కేసులో చేవేళ్ల పోలీస్ స్టేషన్‌లో FIR నమోదైంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆర్మూరులో షాపింగ్ మాల్ అండ్ మల్టిప్లెక్స్ బిల్డింగ్ వివాదం ఇంకా సద్దుమణగక ముందే.. ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కున్నారు జీవన్ రెడ్డి. దాంతో చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో జీవన్‌రెడ్డిపై FIR కూడా నమోదైంది. ఈసారి జీవన్ రెడ్డి ఒక్కరే కాదు.. ఆయన కుటుంబ సభ్యులతో పాటు అనుచరులపై కూడా కేసులు నమోదయ్యాయి. జీవన్ రెడ్డి తన భూమిని కబ్జా చేశారంటూ సామ దామోదర్ రెడ్డి అనే వ్యక్తి చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు చేవెళ్ల పోలీసులు 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 2023లో తన ఫంక్షన్‌ హాల్‌ కూల్చేసి.. జీవన్‌రెడ్డి కబ్జా చేశారని.. నిలదీసేందుకు వెళ్లిన తనపై మరణాయుధాలు చూపించి జీవన్‌రెడ్డి అనుచరులు, రౌడీమూకలు బెదిరించారని దామోదర్‌రెడ్డి ఆరోపించారు.

కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబ్‌ గ్యాంగ్‌ని సెక్యూరిటీగా పెట్టడంతో నిలదీసేందుకు వెళ్లిన తనను పంజాబ్ గ్యాంగ్ దాడి చేసిందని పేర్కొన్నారు దామోదర్ రెడ్డి. అయితే సామ దామోదర్‌రెడ్డి 2022లో ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని కొనుగోలు చేసి ఫంక్షన్ హాల్ కట్టుకున్నారు. పంక్షన్‌ హాలు పక్కనే జీవన్‌ రెడ్డి స్థలం ఉండడంతో .. ఫంక్షన్‌ హాల్‌ని కూల్చి మరీ భూమినీ కబ్జాచేశారని ఫిర్యాదు చేశారు దామోదర్‌రెడ్డి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10