AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాష్ట్ర అవతరణ వేడుకలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

రాష్ట్ర అవతరణ వేడుకలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. జూన్ 2తో రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్నందున ప్రత్యేక వాతావరణంలో ఉత్సవాలు జరిపేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఎన్నికల కోడ్ ఉన్నందున వేడుకలు నిర్వహించేందుకు ఈసీ అడ్డంకి అవుతుందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ తరుణంలో శుక్రవారం రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రాండ్‌లో ఆట్టహాసంగా జరగనున్నాయి. గన్ పార్క్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై సీఎస్ శాంతికుమారి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

వేడుకలకు సోనియా గాంధీ రాక

ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన వారందరినీ సన్మానించడానికి రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. జయ జయహే తెలంగాణ గీతం, సవరించిన రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించనున్నారు. సోనియా గాంధీని ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పలువురిని సత్కరించనున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా సోనియా గాంధీని సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రావిర్భావంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఉద్యమకారులకు సన్మానం చేయనున్నారు. సన్మానం చేయాల్సిన ఉద్యమ కారుల జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ANN TOP 10