AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వామ్మో.. ఇంత మంది నిరక్షరాస్యులు పోటా!

దేశంలో లోక్‌సభ ఎన్నికల హడావుడి నడుస్తోంది. జూన్‌ 1 వరకు మొత్తం ఏడు దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పటికే 5 దశలు పూర్తయ్యాయి. ఆరో దశలో రేపటి నుంచి పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీతో సహా మొత్తం 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 నియోజకవర్గాలకు జరగనున్నాయి. బీహార్ 8 సీట్లు, హర్యానా 10 సీట్లు, జమ్మూ కాశ్మీర్ 1 సీటు, జార్ఖండ్ 4 సీట్లు, ఢిల్లీ 7 సీట్లు, ఒడిశా 6 సీట్లు, ఉత్తరప్రదేశ్ 14 సీట్లు, పశ్చిమ బెంగాల్ 8 సీట్లకుగానూ.. మొత్తం 889 మంది అభ్యర్ధులు పోటీ చేయనున్నారు.

ఈ క్రమంలోనే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఈ ఎన్నికలపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఏడు దఫాలలో ప్రస్తుతం జరుగుతున్న లోక్‌ సభ ఎన్నికల్లో ఏకంగా 8,360 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 121 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. 359 మంది ఐదో తరగతి వరకు చదుకున్నారని తెలిపింది. అలాగే 647 మంది 8వ తరగతి వరకు విద్యా అర్హతలు ఉండగా.. 1303 మంది 12వ తరగతి, 1502 మంది అభ్యర్థులు డిగ్రీ, 198 మంది అభ్యర్థులు డాక్టరేట్లు ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది. పలువురు తమ విద్యార్హతలను వెల్లడించలేదని ఏడీఆర్ నివేదించింది.

ANN TOP 10