AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి దర్శనం, ఆర్జిత సేవలకు అన్‌లైన్ బుకింగ్

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించే భక్తులకు గుడ్ న్యూస్. రోజు రోజుకు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రీశుడి దర్శనం కోరి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతి తిరుమల దేవస్థానం తరహాలోనే యాదాద్రి నర్సన్న ఆలయంలో కూడా టికెట్లును ఆన్‌లైన్‌లో పొందే విధంగా ఏర్పాటు చేసింది యాదాద్రి దేవస్థానం.

తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం తర్వాత ఇలా వైకుంఠంగా పేరుందిన తిరుమల తరహాలో యాదాద్రిలో ఆలయనిర్మాణం, మాఢవీధులు, స్వామివారి పూజ కైంకర్యాలు, ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలు, ప్రసాదాలతో తెలంగాణ తిరుమలగా రూపుదిద్దుకుంది. ఈ పుణ్యక్షేత్రానికి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు వీఐపీ, వీవీఐపీ, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తుల సిఫార్సులపై వచ్చే భక్తులకు 300 రూపాయల టికెట్‌తో బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. రూ.150 చెల్లించి శీఘ్రదర్శనం ఆన్ లైన్ లో నమోదుకు అవకాశం ఉండగా, ప్రస్తుతం అన్ని సేవలను ఆన్ లైన్ అందుబాటులోకి దేవస్థానం తీసుకువచ్చింది.

ఆన్‌లైన్‌లో ‘yadadritemple.telangana.gov.in ‘ వెబ్‌సైట్ ను సందర్శించి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక ఇదే వెబ్ సైట్ నుంచి ఈ హుండీ ద్వారా డొనేషన్స్ కూడా ఇవ్వవచ్చు. ఆన్ లైన్ బుకింగ్ ద్వారా గంట ముందు దర్శన, పూజ కైంకర్యాలకు బుకింగ్ చేసుకునే అవకాశం యాదగిరిగుట్ట దేవస్థానం కల్పించింది.

ANN TOP 10