AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈ నెలాఖరు నుంచి గ్రూప్‌-1 హాల్‌టిక్కెట్లు

రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీ కోసం జూన్‌ 9న స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించడానికి టీఎస్‌పీఎస్సీ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. స్క్రీనింగ్‌ పరీక్షకు హాజరు కావడం కోసం అవసరమైన హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ ప్రక్రియ ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

గ్రూప్‌-1 కోసం రాష్ట్ర వ్యాప్తంగా 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే. హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయనున్నామని అధికారులు పేర్కొన్నారు. త్వరలోనే హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ అయ్యే తేదీని కూడా ప్రకటిస్తామని అన్నారు. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో మొత్తం 563 పోస్టలు ఉన్నాయన్నారు. జూన్‌ 9న నిర్వహించనున్న గ్రూప్‌-1 స్క్రీనింగ్‌ పరీక్షలను వాయిద వేయడం లేదని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

ANN TOP 10