ఫాం 17సీ డేటాను వెబ్సైట్లలో పెట్టడానికి సమస్య ఏమిటని ఎంపీ కపిల్ సిబల్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలింగ్ స్టేషన్లలో పోలైన ఓట్ల రికార్డు ఫాం 17సీ పబ్లిక్‌లో పెట్టలేమని కేంద్ర ఎన్నికల సంఘం అనడాన్ని ఆయన తప్పుబట్టారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఫాం 17సీ ప్రెసైడింగ్ అధికారి సంతకం చేసి ఏంజెంట్కు వెళ్తుందని, ఆ సమాచారం ఈసీఐకి వెళ్తుందన్నారు. మరి ఆ డేటాను వెబ్సైట్లలో పెట్టాడానికి సమస్య ఏమిటని ఆయన ప్రశ్నించారు. వాస్తవానికి పోలైన ఓట్ల సంఖ్య కంటే లెక్కించే ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుందని కపిల్ సిబల్ అనుమానం వ్యక్తం చేశారు. ఇక ఫాం 17సీ అంటే.. ‘పోలింగ్ స్టేషన్ వారీగా రిజల్ట్ షీట్’ అని కూడా పిలుస్తారు. ఇది ప్రతి పోలింగ్ బూత్ వద్ద ప్రిసైడింగ్ అధికారి తయారుచేసిన పత్రం. ఇది బూత్‌లో పోలైన ఓట్ల సంపూర్ణ సంఖ్య, నమోదైన మొత్తం ఓటర్ల సంఖ్య, ఇతర సంబంధిత వివరాలతో సహా వివరణాత్మక సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడానికి ఈ ఫాం చాలా కీలకం.
