AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్ఎస్ నేత దారుణహత్య.. భగ్గుమన్న హరీష్ రావు

వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం చిన్నంబావి మండలం లక్ష్మీ పల్లిలో బిఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గత రాత్రి లక్ష్మీ పల్లిలో శ్రీధర్ రెడ్డిని దారుణంగా గొడ్డలితో నరికి హతమార్చారు. అయితే రాజకీయ విద్వేషాల కారణంగా హత్య జరిగిందని బిఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ హత్యా రాజకీయాలు మొదలు పెట్టింది గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలకు తెర తీసిందని ఆరోపిస్తున్నారు.బీఆర్ఎస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు చేస్తుందని మండిపడింది. గతంలో తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా, బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక హత్యా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిందని ఆరోపించింది.

బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీధర్‌రెడ్డి దారుణహత్య ఘటన కాంగ్రెస్ ప్రేరేపిత హత్యా అని పేర్కొంది. బీఆర్ఎస్ నాయకులపై.. కాంగ్రెస్ నాయకులు వరుసగా అరాచకాలు, దాడులు చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించింది. కబడ్ధార్ మంత్రి జూపల్లి కృష్ణారావు.. ఈ హత్యా రాజకీయాలు ఆపకపోతే ప్రజలే నీకు సరైన గుణపాఠం చెబుతారు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

బీఆర్ఎస్ నేత హత్యపై భగ్గుమన్న హరీష్ రావు
బీఆర్ఎస్ నాయకుడి హత్య ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మిపల్లిలో బిఆర్ఎస్ మండల నాయకులు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురికావడం దారుణం అని అభిప్రాయపడ్డారు.

ANN TOP 10