AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేటీఆర్‌ బచ్చా.. నోరు జాగ్రత్త.. అంటూ కోమటిరెడ్డి మాస్‌ వార్నింగ్‌..!

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ కేటీఆర్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. మరోసారి తమ ముఖ్యమంత్రి రేవంత్‌ని తిడితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.

గురువారం మీడియాతో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి.. కేటీఆర్‌ బచ్చా అని.. తండ్రి పేరు చెప్పుకుని మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. కానీ, రేవంత్‌ రెడ్డి ఇండిపెండెంట్‌గా గెలిచి లీడర్‌ అయ్యారని పేర్కొన్నారు. రేవంత్‌ వయసులో పోలిస్తే కేటీఆర్‌ చిన్న పిల్లాడు అని వ్యాఖ్యానించారు.

సిరిసిల్లలో కేకే మహేందర్‌ రెడ్డి పొట్ట కొట్టి కేటీఆర్‌ ఎమ్మెల్యే అయ్యాడని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి విమర్శించారు. పార్లమెంట్‌ ఎన్నికల రిజల్ట్స్‌ తరువాత బీఆర్‌ఎస్‌ భూస్థాపితం అవడం ఖాయం అని అన్నారు. మేడిగడ్డ మాదిరిగానే బీఆర్‌ఎస్‌ పార్టీ కూలిపోవడం ఖాయం అన్నారు. కేసీఆర్‌ కూతురు కవిత చేసిన పనికి రాష్ట్రం పరువు పోతోందని వ్యాఖ్యానించారు మంత్రి. 5వ తేదీ నుంచి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలే కేటీఆర్, హరీష్‌ రావుని కొడుతారని అన్నారు. నంది నగర్‌ నుండి కారులో న్యూట్రల్‌లో వెళ్లినా అసెంబ్లీకి చేరుకోవచ్చునని.. కట్టే పట్టుకొని అసెంబ్లీకి రాలేదు కానీ, బీజేపీ కోసం బస్సులో తిరిగారని కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు మంత్రి. అసలు తెలంగాణ కోసం కొట్లాడింది తామేనని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.

అన్ని స్థానాల్లో ఓటమి తప్పదు..

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీకి రెండు మూడు స్థానాల్లో డిపాజిట్‌ వస్తుందని.. అన్ని స్థానాల్లో ఓడిపోతుందని మంత్రి కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. 12 రోజుల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ లేకుండా పోతుందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి లీడర్, క్యాడర్‌ లేకుండా పోతారని అన్నారు. 5వ తేది తర్వాత తెలంగాణ భవ¯Œ కి తాళం వేసుకోవాల్సి వస్తుందన్నారు. కవితకు బెయిల్‌ రావట్లేదని కేటీఆర్‌ పూర్తిగా ఫస్ట్రేష¯Œ లోకి వెళ్లారని.. అందుకే ఇష్టారీతిన తమ ప్రభుత్వంపై కారుకూతలు కూస్తున్నారంటూ కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ANN TOP 10