AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కల్కీ ఈవెంట్‌లో ప్రభాస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కీ 2898 ఏడీ’ మూవీ ఈవెంట్ హైదరాబాద్ రామోజ్ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్లో ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. లోకనాయకుడు కమల్ హాసన్ తో కలిసి నటించడం చాలా గర్వం ఉందన్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ను చూసి సినీ ఇండస్ట్రీ స్ఫూర్తి పొందిందని చెప్పారు. ఎవరైనా సరే అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ కావాల్సిందేనన్నారు. తాను కూడా అమితాబ్ ను స్ఫూర్తిగా తీసుకుని సినిమాల్లో వచ్చానని చెప్పారు. ‘సాగర సంగమం’లో కమల్ హాసన్ వేసుకున్న దుస్తులు చిన్నతనంలో చాలా బాగా నచ్చేవని, అలాంటి దుస్తులు కుట్టించాలని తన తల్లిని అడిగినట్లు ఈవెంట్లో ప్రభాస్ తెలిపారు. కమల్ నటనకు 100 దండాలు అంటూ ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ANN TOP 10