AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హైదరాబాద్ ​సీసీఎస్ ​ఏసీపీ ఉమామహేశ్వరరావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ ​విధించింది. ఈ మేరకు ఆయనను పోలీసులు బుధవారం చంచల్​‌గూడకు తరలించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో ఏసీపీ నివాసంతోపాటు 14 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. రూ.3 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. ఉమామహేశ్వరరావు నివాసంలో రూ.38 లక్షల నగదు, 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆస్తుల మార్కెట్ విలువ రూ. 40 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్ ​సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 17 ప్రాంతాల్లో స్థిరాస్తులను అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఉమామహేశ్వరరావు అరెస్టు చేశారు. ఆ తర్వాత తాజాగా, బుధవారం ఆయనను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్​విధించారు. ఈ క్రమంలో ఉమామహేశ్వరరావును చంచల్‌​గూడ జైలుకు తరలించారు.

భారీగా ఆస్తులు:
రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు మరోవైపు, రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి.అశోక్​నగర్‌​లో 205, 504 ఫ్లాట్స్‌లో సోదాలు నిర్వహించామని రిమాండ్ రిపోర్టులో, బర్కత్‌​పురాలో డీఎస్పీ సందీప్​రెడ్డి నివాసంలో కూడా సోదాలు జరిపారు. ఇక, కాప్రాలోని ఏసీపీ స్నేహితుడు నరేంద్ర బాబు నివాసంలోనూ దాడులు చేశారు. సికింద్రాబాద్‌​లో​నీలిమా నివాసం, అనకాపల్లిలో బంధువు మహాలక్ష్మి, విశాఖపట్టణంలోని బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. రేవంత్ ప్రభుత్వంలో కొత్త నియామకాలు ఈ సోదాల్లో నగదు రూ.38 లక్షలు, బంగారం 60 తులాలకుపైగా స్వాధీనం చేసుకున్నారు.

ANN TOP 10