AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేపు మధ్యాహ్నం 3 గం. కేబినెట్ సమావేశం

కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి మేరకు రేపు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. వాస్తవానికి శనివారం మంత్రివర్గ సమావేశం నిర్వహించాలనుకున్నప్పటికీ ఈసీ అనుమతి నిరాకరించడంతో చివరి క్షణంలో వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఈసీ ఆంక్షలపై రాష్ట్ర కేబినెట్ కొంత నిరుత్సాహానికి గురైనప్పటికీ అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘంతో మాట్లాడాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ భేటీకి కొన్ని షరతులు విధిస్తూ అనుమతించింది. అయితే షరతులను కూడా విధించింది. రుణమాఫీ, ఉమ్మడి రాజధాని విషయాలకు వెళ్లకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.

ANN TOP 10