AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు

ఇవాళ నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులను తాకినట్లు భారత వాతావరణ (ఐఎండీ) శాఖ వెల్లడించింది. ప్రతి ఏటా మే 18-20 మధ్య ఈ ప్రక్రియ జరుగుతుండగా.. ఈ సారి కూడా అలాగే రుతుపనాలు కదులుతున్నాయని తెలిపింది. దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్, మాల్దీవులు, కొమోరిన్లోని కొన్ని ప్రాంతాల్లో రుతుపనాలు విస్తరించాయని పేర్కొంది. ఈ నెల 31కి నైరుతి కేరళ తీరాన్ని, జూన్ మొదటివారంలో రాయలసీమను తాకనున్నట్లు అంచనా వేసింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర, రాయలసీమలో వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల చివరి వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా బలపడొచ్చని అంచనా వేసింది. నేడు సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీకాకుళం, అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, గోదావరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. సకాలంలోనే రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు రావడంతో రైతులు అనందం వ్యక్తం చేస్తున్నారు.

ANN TOP 10