ఓటు వేసే ముందు పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలనూ పరిశీలించాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపినిచ్చారు. ఆదివారం భువనగిరిలోని సాయి పంక్షన్ హాల్ నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించిందన్నారు. తాము ఎప్పుడూ గుడి పేరుతో ఓట్లు ఆడగలేదన్నారు. బీఆర్‌ఎస్ హాయంలో ప్రాజెక్టులు కట్టామని, వాటికి దేవుళ్ల పేర్లు పెట్టామని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి నల్లొండ జిల్లాకు మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చామన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బిట్స్ పిలానీలో చదుకున్న అభ్యర్థికి, బ్లాక్ మెయిలర్‌కు జరుగుతన్నాయని, ఎవరు కావాలో ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ అన్నారు.
