పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికైన భారత్‌కు చెందుతుందని, దానిని వెనక్కు తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఫరూక్ అబ్దుల్లా, మణిశంకర్ అయ్యర్లు పాకిస్థాన్‌లో అణుబాంబు ఉన్నందున గౌరవం ఇవ్వండని చెబుతున్నారని, అటువంటి వాటికి బీజేపీ భయపడదన్నారు. పీఓకే ముమ్మాటికీ భారత్ దే. ఎప్పటికైనా భారత్‌లో కలవాల్సిందేని నొక్కి చెప్పారు. 70 ఏళ్లుగా కశ్మీర్‌లో ప్రజలు అర్టికల్ 370తో బాధపడ్డారని, కానీ దాన్ని బీజేపీ హయాంలో రద్దు చేశామన్నారు. ఇప్పటికే దేశంలో నాలుగు దశల్లో పోలింగ్ ముగిసిందని, ఆ నాలుగు దశల్లో ఇండియా కూటమి ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయిందని విమర్శించారు. మోడీ సర్కార్ మరోసారి అధికారంలోకి వస్తుందని, ఈ ఎన్నికల్లో తాము 400 సీట్లు గెలుస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
