రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే దేశ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి సీతక్క అన్నారు. ఢిల్లీలో మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఢిల్లీ పార్లమెంట్ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సీతక్క గత పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న పార్టీ విపక్షాలపై విమర్శలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద మహిళలకు ఉపయోగపడే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే బీజేపీ ప్రభుత్వం విమర్శలు చేస్తుందన్నారు. నియంత పాలన తీసుకురావాలని మోడీ కుట్ర చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు.
