AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు..

యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో నారసింహుని దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూలైన్లలో రద్దీ నెలకొన్నది. ఈ నేపథ్యంలో స్వామివారి సర్వదర్శనానికి మూడు గంటలకుపైగా సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు పడుతున్నది.

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయం, అనుబంధ ఆలయాలైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు జనగామ జిల్లా బచ్చన్నపేట మండంల దుబ్బగుంటపల్లి యోగానందనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 20 నుంచి 22 వరకు జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. 20న స్వస్తివాచనం, 21న లక్ష పుష్పార్చన, 22న మూలమంత్ర హవనం, నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావం, మహానివేదన, తీర్థప్రసాద గోష్టి నిర్వహించి ఉత్సవాలు పరిపూర్ణం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్సవాల నేపథ్యంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత కల్యాణాలు, బ్రహ్మోత్సవాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.

ANN TOP 10