AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈసీ నిర్ణయం.. బాటిళ్లలో పెట్రోల్ అమ్మకం బంద్!

ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని పెట్రోల్ బంకుల్లో బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరగకుండా నిషేధం విధించింది. కాగా బాటిళ్లల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకూడదని గతంలోనూ పోలీసుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. పలు ఘటనల నేపథ్యంలో బాటిళ్లలో పెట్రోల్ అమ్మకూడదని పోలీసులు గతంలోనూ ఆదేశించారు. అయితే పల్నాడు జిల్లాలో పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకోవటం పోలీసులను కలవరపరిచింది. అలాగే ఓ రాజకీయ నేత ఇంట్లో భారీగా పెట్రోల్ బాంబులు దొరకడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సీసాలు, క్యాన్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాలకు మాత్రమే ఇంధనం నింపాలని పేర్కొంది. ఈ మేరకు ఈసీ ఆదేశాలతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ పెట్రోల్, డీజిల్ బంకుల యజమానులకు నోటీసులు పంపింది. నిబంధనలు అతిక్రమిస్తే పెట్రోల్ బంకుల లైసెన్స్ లు రద్దు చేస్తామని హెచ్చరించింది. దీనిపై ఇంధన డీలర్ల సమాఖ్య సానుకూలంగా స్పందించింది.

ANN TOP 10