టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ రూటే సఫరేటు. ఆయన సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా అదో ఓ వివాదాస్పదంగా మారుతుంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోను ఆర్జీవీ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పోస్ట్ చేశారు. నా స్నేహితుడు రేవంత్ రెడ్డి ఫైర్‌కాకర్‌ను కలిశానంటూ రాసుకొచ్చారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఇంకేంటి మరి రేవంత్ రెడ్డి బయోపిక్ కూడా తీస్తునట్టేగా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ డైరెక్టర్ల సంఘం కలిసింది. ఈ నెల 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి సీఎంను దర్శకులు సంఘం ఆహ్వానించింది. అసోసియేషన్ అధ్యక్షుడు వీర శంకర్, వైస్ ప్రెసిడెంట్ వశిష్ట, దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
