AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య..

ఇటీవల రోడ్ యాక్సిడెంట్‌లో ‘త్రినయని’ సీరియల్‌ ఆర్టిస్ట్ పవిత్ర జయరాం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణ వార్త మరవకముందే అదే సీరియల్‌కు చెందిన మరో నటుడు చందు ఆత్మహత్య చేసుకోవడం తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో మరోసారి తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం హైదరాబాద్, మణికొండలోని తన నివాసంలో చందు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఆత్మహత్యకు సంబంధించి వివాహేతర సంబంధమే కారణం అనేలా వార్తలు వినబడుతున్నాయి. గత వారం యాక్సిడెంట్‌లో చనిపోయిన పవిత్ర జయరాంతో ఆరేళ్లుగా చందుకు వివాహేతర సంబంధం ఉందని, ఆమె మరణానంతరం ఆయన పూర్తిగా డిప్రెషన్‌కి వెళ్లిపోవడమే కారణం అనేలా టాక్ వినబడుతోంది. చందు ఆత్మహత్యకు సంబంధించిన కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు చందు ఆత్మహత్యకు కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది.

‘త్రినయిని’తో పాటు పలు సీరియల్స్‌లో చందు నటించారు. ప్రస్తుతం రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం వంటి సీరియల్స్‌లో చందు నటిస్తున్నారు. 2015లో శిల్పను చందు ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చందు మృతితో ఒక్కసారిగా బుల్లితెర ఇండస్ట్రీలో విషాద చాయలు అలుముకున్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. చందు తెలిసిన వారంతా ప్రార్ధిస్తున్నారు.

ANN TOP 10