AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫ్రీ బస్సు ప్రయాణంపై మోడీ షాకింగ్ కామెంట్స్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రధాన మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోన్న విషయం తెలిసిందే. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో ప్రస్తుతం ఈ పథకం కొనసాగుతోంది. దీనిపై తాజాగా మోడీ స్పందిస్తూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మెట్రోను ఇబ్బందుల్లో పడేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో దాదాపు 50 శాతం మహిళా ప్రయాణికులను మెట్రో కోల్పోతుందన్నారు. ఇలా చేయడం వల్ల మెట్రో నిర్వహణ కష్టతరంగా మారుతుందని, భవిష్యత్తులో మెట్రో నిర్మాణం జరుగడం కూడా అసాధ్యంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఇదంతా ఎవరూ ఆలోచించరని, ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఇలాంటి హామీలు ఇస్తున్నారని అన్నారు. బస్సును ఫ్రీగా ఇచ్చి మెట్రోను ఖాళీ చేస్తే ఎలా నడుస్తుందని మోడీ ప్రశ్నించారు.

ANN TOP 10