AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యూరప్‌ టూర్‌లో సీఎం జగన్.. వెకేషన్ ఎన్ని రోజులంటే.?

ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. నిన్న మొన్నటి వరకూ ఎన్నికల హడావుడితో బిజీబిజీగా గడిపారు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఇక కౌంటింగ్‌కి చాలా సమయం ఉండడంతో.. కుటుంబంతో సరదాగా గడిపేందుకు ఫారిన్‌ టూర్‌కి వెళ్తున్నారు.

ఇవాళ సతీమణి వైఎస్‌ భారతీతో కలిసి తాడేపల్లి నివాసం నుంచి మొదట లండన్ వెళ్తారు. అక్కడి నుంచి కుమార్తెలతో కలిసి లండన్‌తో పాటు ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌‌కు వెళ్లే అవకాశం ఉంది. దీంతో సీఎం జగన్ ఫ్యామిలీ మొత్తం జూన్ 1వ తేదీ వరకూ యూరప్‌ దేశాల్లో పర్యటించనున్నారు. ఎన్నికల కౌంటింగ్‌కి మూడు రోజుల ముందు సీఎం జగన్‌ ఏపీకి తిరిగి వస్తారు. ఇప్పటికే సీఎం జగన్‌ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఫారిన్‌ టూర్‌కి వెళ్తున్నారు. గత ఎన్నికల తర్వాత కూడా పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకి వెళ్లారు.

ANN TOP 10