AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో BJP గెలిచే స్థానాలు ఎన్నంటే..? ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచేది తామంటే తామేనంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ధీమా వ్యక్తంచేస్తున్నాయి. తెలంగాణలో 13 నుంచి 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనావేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాగా బీజేపీ 12 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తుందని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తంచేశారు.

మోదీ పాలనలో భారత్‌లో హింసకు తావులేకుండా ప్రశాంతకు నిలయంగా మారిందన్నారు బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్. ప్రపంచంలోనే స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్‌గా మోదీ ఎదిగారన్నారు. నల్గొండలో నిర్వహించిన పట్టభద్రుల సన్నాహక సమావేశంలో ఆయన ఈ కామెంట్లు చేశారు.

బీఆర్ఎస్ కి రెండోసారి ప్రజలు అధికారం ఇస్తే..అహంకారంతో వ్యవహించారని విమర్శించారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీకి ఓటేశారని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ బీజేపీ సత్తా చాటుతుందన్నారు.

ANN TOP 10