హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మణికొండ, షేక్‌పేట, గచ్చిబౌలి, ఖైరతాబాద్, దిల్సుఖ్ నగర్, పంజాగుట్ట తదితర ఏరియాల్లో వర్షం పడుతోంది. రెండు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి నగర ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ఏకధాటిగా కుండపోత వర్షం పడుతుండడంతో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. దీంతో నగరంలోని రోడ్లు నీటితో నిండిపోయాయి. హైదరాబాద్‌లో కుండ పోత వర్షం పడటంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌తో పాటు వర్షం పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
