AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమిత్ షా గురించే మోడీ తపన.. కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

రిజర్వేషన్లకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకమని ఆప్ అధినేత, ఢిల్లీ అర్వింద్ కేజ్రీవాల్ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చుతుందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు బీజేపీ రద్దు చేస్తుందన్నారు. గురువారం లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో కలిసి ఆయన సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ప్రధాని మోడీ తన కోసం కాకుండా అమిత్ షా కోసం ఓట్లు అడుగుతున్నారు. బీజేపీ గెలిస్తే యోగి ఆదిత్యనాథ్‌ను సీఎం పదవి నుంచి తొలగిస్తారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీకి సెప్టెంబర్ 17, 2025 నాటికి 75 ఏళ్లు నిండుతాయని, అమిత్ షాను తన రాజకీయ వారసుడిగా చేయాలని నిర్ణయించుకున్నారని అన్నారు. అందుకే అమిత్ షాను ప్రధానిని చేసేందుకే మళ్లీ గెలిపించాలంటున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.

అయితే, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని తొలగిస్తామని నేను చేసిన కామెంట్స్ పై ఇప్పటి వరకు బీజేపీ నేతలెవరూ స్పందించలేదన్నారు. బీజేపీలో ఉన్న రూల్స్ ప్రకారం 75 ఏళ్ల నిబంధనను పెట్టి మరీ ఎల్‌కే అద్వానీని తొలగించారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 75 సంవత్సరాల వయస్సులో రాజీనామా చేయనని మాత్రం చెప్పలేదని కేజ్రీవాల్ అన్నారు. ఇక హర్యానా, ఢిల్లీ, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, యూపీ, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్‌లలో బీజేపీకి సీట్లు తగ్గనున్నాయన్నారు కేజ్రీవాల్. జూన్ 4వ తేదీన భారత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని దేశవ్యాప్తంగా పలు సర్వేలు చెబుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 220 సీట్ల కంటే తక్కువ సీట్లు వస్తాయని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు.

ANN TOP 10