ఏపీ ఫలితాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం విజయవాడలో ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మళ్లీ తామే అధికారంలోకి వస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. 2019లో సాధించిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు గెలువబోతున్నామన్నారు. 22 ఎంపీ సీట్లు గెలుస్తున్నామన్నారు. వచ్చే ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల కంటే ఎక్కువగా ప్రజలకు మేలు చేద్దామన్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుందని, ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తామన్నారు. జూన్ 4న ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుందన్నారు. ఐ ప్యాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనిదని వివరించారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఊహించనంత సీట్లు రాబోతున్నాయని, ఆయన చేసేది ఏం లేదు. వర్క్ అంతా టీమ్ చేస్తుందని జగన్ అన్నారు.
