తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లను సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ అవతరించనుందని అన్నారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతలోని ప్రజలు సైతం బీజేపీకి బ్రహ్మరథం పట్టారన్నారు. రిజర్వేషన్లపై రేవంత్, బీఆర్ఎస్ చేసిన కుట్రలను ప్రజలు విశ్వసింతలేదన్నారు. రిజర్వేషన్లు తీసేసే శక్తి ఈ దేశంలో ఎవరికీ లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన విధానం, బీజేపీకి పెరిగిన ఓటు బ్యాంక్, రాష్ట్రంలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తన అంచనాలను వివరిస్తున్నారు.
గతంలో కంటే ఈ ఏడాది బీజేపీ ఓటు బ్యాంక్ భారీగా పెరిగిందని ఆయన ఆశాభావంతో ఉన్నారు. గత రెండు రోజులుగా పార్టీ నేతలతో సమావేశాల అనంతరం వారిచ్చిన ఫీడ్ బ్యాక్ పరిశీలించిన తరువాత బీజేపీకి గతంలోనే కంటే మెరుగైన సీట్లు వస్తాయని మోడీ నాయకత్వంలో ప్రజల్లో నమ్మకం భారీగా పెరిగిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. జూన్ 4న తేదీన బీజేపీకి 400 సీట్లకు పైగా వస్తాయని దేశ ప్రజలు మూడోసారి కూడా మోడీ నాయకత్వానికి పట్టం కడతారని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారని దుయ్యబట్టారు. ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం తప్ప మిగతావి ఏవి జరగలేదన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై మరింత భారం మోపారని వ్యాఖ్యానించారు. పెళ్లి చేసుకుంటే తూలం బంగారం ఇస్తామన్నారని, అది ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అబద్దాలు మాట్లాడటం మానుకోవాలన్నారు.