జల్గావ్: మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భద్రతా సిబ్బందిలో స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జామ్నేర్ పట్టణంలోని తన సొంత ఇంట్లో అతను కాల్చుకున్నట్లు తెలుస్తోంది. బలవన్మరణానికి పాల్పడిన ఆ పోలీసును ప్రకాశ్ కాప్డేగా గుర్తించారు. తన పూర్వీకుల గ్రామానికి వెళ్లేందుకు అతను కొన్ని రోజుల నుంచి లీవ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సర్వీస్ గన్‌తోనే తన మెడ భాగంలో కాల్చుకున్నాడు.
అతనికి భార్య, ఇద్దరు పిల్లలు, ఓ సోదరుడు ఉన్నారు. బుధవారం రాత్రి 1.30 నిమిషాలకు అతను ఆత్మహత్య చేసుకున్నట్లు జామ్నేర్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ షిండే తెలిపారు. పోలీసులు విచారణ చేపడుతున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆ జవాన్ బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణ ద్వారా గుర్తించారు. కాప్డే మృతదేహానికి అటాప్సీ చేస్తున్నారు. వీవీఐపీకి సెక్యూరిటీ కల్పిస్తున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఎస్‌ఆర్పీఎఫ్ వ్యక్తిగతంగా ఈ కేసును దర్యాప్తు చేయనున్నది.