ఏపీలో పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. దీంతో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలకు సీఈసీ సమన్లు జారీ చేసింది. ఈ మేరకు వారు ఇద్దరు రేపు ఢిల్లీకి రావాలని ఆదేశించింది. పోలింగ్ అనంతరం హంసను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు అనే అంశంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గురువారం ఢిల్లీకి వచ్చి ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పోలింగ్ తర్వాత రోజు (మంగళవారం) తిరుపతి, మాచర్ల, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. అదే విధంగా సత్తెనపల్లి, మాచర్ల, పిడుగురాళ్లలో పోలీసులు షాపులు మూయించారు.
