టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. గత మూడు రోజులుగా తాడిపత్రిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనల నేపథ్యంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. దీని ప్రభావంతో జేసీ అస్వస్థతకు గురయ్యారు. భాష్పవాయువు కారణంగా ఆయనకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది.
ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి తెలిపారు. చికిత్స పొందుతున్న తన తండ్రిని చూసేందుకు ఎవరూ రావద్దని కార్యకర్తలను ఆయన కోరారు. మరోవైపు, వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని కిమ్స్ డాక్టర్లు తెలిపారు.